తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ అమలాపురం మండలంలోని వన్నె చింతలపూడి గ్రామంలోని పరపేటకు చెందిన మహిళలు అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన చేపట్టారు. ఈ మేరకు మంచినీళ్ల కొలత వలన తాగడానికి నీళ్లు లేకుండా అల్లాడిపోతున్నామని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అధికారులను కలిసి వారి సమస్యను తెలియజేశారు. తమ తాగునీటి సమస్య ను పరిష్కరించాలని కోరారు.