భూ సంబంధిత సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం గ్రామస్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని తహశీల్దార్ కిశోర్ బాబు తెలిపారు. అమలాపురం రూరల్ మండలం ఇమ్మిడివరప్పాడు గ్రామ సచివాలయం వద్ద బుధవారం జరిగిన రెవెన్యూ సదస్సులో తహశీల్దార్ మాట్లాడారు. భూ సమస్యలను తక్షణమే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రేలంగి దుర్గారావు, మాజీ సర్పంచ్ మందా గెద్దయ్య, వీఆర్వో అధికారులు పాల్గొన్నారు.