వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. కోనసీమ జిల్లాలో ఈ నెల 16 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల గోడ పత్రికను ఆయన గురువారం అమలాపురం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. డ్రైవింగు వ్యక్తిగత అనుభవంగా కాకుండా సామాజిక బాధ్యతగా గుర్తించాలని సూచించారు.