నేషనల్ మజ్దాూర్ యూనిటీ అసోసియేషన్ జోనల్ కమిటీ పిలుపుమేరకు అమలాపురం డిపోలో గేట్ మీటింగ్ శుక్రవారం నిర్వహించారు. ఆర్టీసీ డ్రైవర్ నారాయణ పైఅక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలని, నిధుల్లోకి తీసుకోవాలన్నారు. 1/2019 సర్కులర్ అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా నేషనల్ మజ్దార్ కార్యదర్శి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. సంఘీభావంగా యునైటెడ్ యూనియన్ తమ మద్దతు తెలిపారు.