శాస్త్రీయ విజ్ఞాన అంశం ప్రత్యక్ష అనుభవం, అధ్య యనానికి తోడ్పడుతుందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేశ్ కుమార్ తెలిపారు. కోనసీమ విద్యా శాఖ ఆధ్వర్యంలో జిల్లా ప్రాథమిక స్థాయి, ఐదవ తరగతి స్థాయి విద్యార్థులకు శాస్త్రీయ అవగాహన పెంచేందుకు ఈనెల 4, 5 తేదీల్లో శాస్త్రీయ అనుభవ యాత్ర నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. యాత్ర గోడ పత్రికలను బుధవారం ఆవిష్కరించారు.