ఉప్పలగుప్తం మండల పరిధిలోని గ్రామాలలో డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేశామని ఎస్ఐ రాజేష్ ఆదివారం తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల పరిధిలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. డ్రోన్ కెమెరాతో నిఘా వల్ల ఏ ఘటన జరిగిన క్షణాల్లో తమ దృష్టికి వస్తుందని చెప్పారు. తద్వారా నేరాలను నివారించే అవకాశం కలుగుతుందని ఎస్ఐ పేర్కొన్నారు.