ప్రోటోకాల్ విషయంలో నిబంధనలు పాటించని వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖండవిల్లి భరత్ కుమార్ డిమాండ్ చేశారు. లూయిస్ బ్రెయిలీ 216 జయంతోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం అమలాపురంలో కలెక్టరేట్ వద్ద ఏర్పాటుచేసిన సభలో కోనసీమ జిల్లా వివిధ సంఘాలకు చెందిన దివ్యాంగుల నాయకులకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించారు.