అమలాపురంలోని కాపు కళ్యాణ మండపం వద్ద ఆమూడా ఛైర్మన్ గా అల్లాడి స్వామి నాయుడు ప్రమాణ స్వీకారం మహోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్, జిల్లాలోని కూటమి ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రమాణస్వీకారోత్సవాన్ని పురస్కరించుకొని సోంబాబును జాయింట్ కలెక్టర్ నిశాంతి, మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు సత్కరించి శుభకాంక్షలు తెలిపారు.