రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి బాటలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం చేపడుతున్న విజన్ @2047 సహకారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ఆయన అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద బుధవారం విజన్ @2047 గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్, కలెక్టర్ మహేశ్ కుమార్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.