కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి వారి నూతన (2025) సంవత్సర కేలండర్ ను రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆవిష్కరించారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సత్యానందరావు మాట్లాడుతూ ఈ నూతన ఆంగ్ల సంవత్సరం మొదలుకొని స్వామి వారి ఆశీస్సులు అందరిపైనా ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు.