అమలాపురం మండలం పేరూరులో నెలకొన్న సమస్యల పరిష్కారం కోరుతూ గ్రామ ప్రజలు శనివారం డీపీవో శాంతాలక్ష్మికి ఫిర్యాదు చేశారు. సక్రమంగా డ్రైనేజీ సదుపాయం లేకపోవడంతో నీరు ఎక్కడికక్కడ స్తంభించిపోతుందని శివ, శివరాజు, శ్రీధర్ డీపీవోకి వివరించారు. డ్రైనేజీ సదుపాయాలు లేని లేఔట్లకు అనుమతులు ఇవ్వడం వల్ల వర్షపు నీరు నిలిచిపోయి దోమలు పెరిగిపోతున్నాయని తెలిపారు.