రైతుల పట్ల రైతు సమస్యల పట్ల కూటమి ప్రభుత్వం స్పందిస్తున్న తీరు అభినందనీయమని రైతు సంఘం నాయకుడు పత్తి దత్తుడు అన్నారు. ఆయన అంబాజీపేటలో గురువారం మీడియాతో మాట్లాడారు. రైతులు వారికి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ ధాన్యాన్ని విక్రయించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించడం హర్షించదగ్గ విషయమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం బకాయి పెట్టిన ధాన్యం సొమ్ములు విడుదల చేసింది అన్నారు.