మామిడికుదురు మండలంలోని పాశర్లపూడి, కైకాల పేట నుంచి అమ్మ మార్కెట్ వరకు వెళ్లే జాతీయ రహదారి ప్రాణగండంగా మారింది. ప్రయాణికులు మంగళవారం ఈ రహదారిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. నిత్యం ఈ రహదారిపై ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు తక్షణం స్పందించి ఆధునీకరణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు.