జగ్గంపేట పట్టణ పరిధిలోని జరుగుతున్న సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులను కాకినాడ టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ సోమవారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. శ్రీరామ్ నగర్, టవర్ కాలనీ, తిరుమలేశా నగర్, కాపు కళ్యాణ మండపం తదితర కాలనీలలో నిర్మిస్తున్న రోడ్లను స్థానిక నాయకులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతగా ఉండాలని సూచించారు.