కిర్లంపూడి మండలం కిర్లంపూడి ప్రభుత్వం ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శనివారం నిర్వహించిన పేరెంట్స్ సమావేశంలో ఎస్ఐ సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల చదువులు, అలవాట్లపై తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలన్నారు. పిల్లల చదువుల విషయాలను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలన్నారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న మంచి చెడు పలు విషయాలపై విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.