కాకినాడ జిల్లాలో సంక్రాంతి సందర్భంగా పలుచోట్ల పేకాట, కోడి పందాలు, గుండాటలపై దాడులు చేసి127 మంది నిర్వాహకులు జూదరులపై కేసుల నమోదు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. గురువారం ఆయన కాకినాడలో విలేకరులతో మాట్లాడారు. పేకాట, గుండాట నిర్వహించినవారిపై జూదం ఆడిన వారిపై 127 కేసులు నమోదు చేయడం జరిగింది. కోడిపందాలు నిర్వాహకులు, ఆడిన వారిపై 161 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.