కాకినాడలో జరుగుతున్న17 వ రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక స్వర్ణోత్సవ మహాసభల ను విజయవంతం చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొమ్మోజు శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ యుటిఎఫ్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలోవారు మాట్లాడారు. తొలి స్వర్ణోత్సవ మహాసభలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.