స్వాతంత్ర సమరయోధురాలు, వైద్యురాలు అయిన కెప్టెన్ లక్ష్మీ సెహగల్ ప్రముఖ సంఘ సేవకురాలిగా దేశ ప్రజలకు విశేష సేవలు అందించారని వాకర్స్ జిల్లా కోఆర్డినేటర్ అడబాల రత్న ప్రసాద్ పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్ లో బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో కెప్టెన్ లక్ష్మీ షహగల్ వర్ధంతి జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ కాలంలో సుభాష్ చంద్రబోస్ ఆదేశం మేరకు మహిళా రిజిమెంట్ ను ఏర్పాటు చేశారని అన్నారు.