రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో యరబోలు రమేష్- చిత్ర దంపతుల కుమార్తె సుహిత పుట్టినరోజు పురస్కరించుకుని ఇంటర్మీడియట్, పదో తరగతిలో ఉత్తమ
ఫలితాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా బాలల సంక్షేమ అధికారి సిహెచ్ వెంకట్రావు మాట్లాడుతూ విద్య సాంస్కృతిక విలువలు మరియు నిబంధనలను బోధించడం ద్వారా పిల్లలను సమాజంలో ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దుతుందని అన్నారు. ఆ దిశగా నేడు అమ్మాయిలు కూడా అన్ని రంగాలలో ఉత్తమ
ఫలితాలు సాధిస్తూ దూసుకు వెళ్లడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఘనంగా సత్కరించి ఒక్కొక్కరికి 1000 రూపాయలు చొప్పున నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, చింతపల్లి సుబ్బారావు, రమేష్, రాజా, ఎస్. శ్రీ నగేష్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.