తూ.గో జిల్లాకు వడగాల్పుల హెచ్చరిక

50చూసినవారు
తూ.గో జిల్లాకు వడగాల్పుల హెచ్చరిక
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ఆదివారం శ్రీకాకుళం (11), విజయనగరం (16), మన్యం (13), అల్లూరి (3), కాకినాడ (1), తూ.గో (1) మండలాల్లో తీవ్ర వడగాల్పులు నమోదయ్యాయి. సోమవారం శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో 34 మండలాల్లో తీవ్రంగా, 171 మండలాల్లో మోస్తరు వడగాల్పులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్