60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్స్ అందరికి ఆదాయంతో నిమిత్తం లేకుండా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా వర్తింపు చేయాలని సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రాజు కోరారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్య పేటలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 70 ఏళ్లు పైబడిన వారికి కేంద్ర ప్రభుత్వం ఆదాయంతో సంబంధం లేకుండా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా వర్తింపు చేస్తుందన్నారు. వైద్యాన్ని ఉచితంగా అందిస్తుందన్నారు.