కాకినాడలోని సాంబమూర్తి నగర్ లో అంధుల పునరావాస కేంద్రం పూర్తిగా శిథిలావస్థకు చేరి గోడలు పడిపోతున్నాయని విభిన్న ప్రతిభావంతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం అంధులు ఆందోళనకు దిగారు. జిల్లాకు వస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ కేంద్రాన్ని పరిశీలించి కొత్త భవనం నిర్మించి ఇవ్వాలన్నారు. పవన్ వస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు.