కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ గంగాలమ్మ తల్లి ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దంపతులు శనివారం సాయంత్రం సారె పెట్టి మొక్కు తీర్చుకున్నారు. అమ్మవారికి ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, నియోజకవర్గం అభివృద్ధి చెందాలని, అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.