ఎండలు నేపథ్యంలో రూరల్ ఎమ్మెల్యే నానాజీ ఆదేశాల మేరకు కరప-పేపకాయలపాలెం మధ్య జనసేన సీనియర్ నేత భోగిరెడ్డి కొండబాబు ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. పాదాచారులకు, వాహనదారుల దాహర్తిని తీరుస్తున్నామని తెలిపారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భోగిరెడ్డి గంగాధర్ నాయకులు యాళ్ల పండు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.