కాకినాడ జిల్లా పెద్దాపురం రాష్ట్ర ఉపాధ్యక్షులు రెడ్ల వీర రాఘవరావు నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు యర్రం శెట్టి అంజిబాబు సమక్షంలో నియమించడం జరిగింది. అనంతరం జిల్లా అధ్యక్షుడు సలాది శ్రీనివాసరావు మాట్లాడుతూ కాపులకు పెళ్ళికానుక పథకాన్ని ప్రభుత్వంవెంటనే ఏర్పాటు చేయాలని, కాపుల సంక్షేమా పథకాలు అందరికీ అందేటట్లు చూస్తానని కాపుల నిధి ఏర్పాటు చేసేందుకు నా వంతు కృషి చేస్తానని తెలియజేశారు. నూతన జిల్లా అధ్యక్షుడు సలాది శ్రీనివాస బాబుని పలువురు ఘనంగా పూలమాలవేసి దుస్సాలతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పసుపులేటి రాజశేఖర్, సభ్యులు పచ్చిపాల సత్తిబాబు, తుమ్మల ఆంజనేయులు, ముత్యాలఆంజనేయులు, కర్రీ వెంకటరమణ, , కరి శ్రీను, కామేశ్వరరావు, వెంకట్రావు రాజన్న, కర్రీ పద్మనాభం, సలాది
నాగబాబు తదితరులు పాల్గొన్నారు.