దొంగతనం కేసులు ఇరువురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ 3 లక్షల నగదు 48 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్. విద్యాసాగర్ తెలిపారు. ఆలమూరు పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కేసులో కడియం మండలం రాజవోలు గ్రామానికి చెందిన తమ్మవినోద్ కుమార్ అదే గ్రామానికి చెందిన ఏలూరు పవన్ కుమార్ లను అరెస్టు చేసినట్లు చెప్పారు.