కాట్రేనికోన మండలం కాట్రేనికోనలో సర్పంచ్ గంటి వెంకట సుధాకర్ అధ్యక్షతన గ్రామ రెవెన్యూ సదస్సు శుక్రవారం నిర్వహించారు. గ్రామ రెవెన్యూ సదస్సులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో తహశీల్దార్ సునీల్ కుమార్ అటవీ శాఖ, దేవాదాయ శాఖ ఇతర అధికారులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని ప్రజల నుంచి రెవెన్యూ పరమైన సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకుని వాటిపై అర్జీలను స్వీకరించారు.