కొత్తపేట: చౌక డిపో డీలర్ల రాత పరీక్షలో 75 మంది ఎంపిక

66చూసినవారు
కొత్తపేట: చౌక డిపో డీలర్ల రాత పరీక్షలో 75 మంది ఎంపిక
చౌకడిపో డీలర్ల నియామకానికి సంబంధించి ఈనెల 19వ తేదీన నిర్వహించిన రాతపరీక్షలో 75 మంది అభ్యర్థులుఎంపికైనట్లు కొత్తపేట ఆర్డిఓ పి. శ్రీకర్ మంగళవారం తెలిపారు. వీరికి 22, 23 తేదీలలో ఆర్డీవో కార్యాలయంలో ఉదయం10. 30నిమిషాలకు మౌఖిక పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. 22వ తేదీన కొత్తపేట, పి. గన్నవరం, రావులపాలెం, 23వ తేదీన అయినవిల్లి, ఆలమూరు, అంబాజీపేట, ఆత్రేయ పురం మండలాల అభ్యర్థులకు మౌఖిక పరీక్ష నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్