గోపాలపురంలో యధేచ్ఛగా ఇసుక దందా!

78చూసినవారు
ఉచిత ఇసుక విషయంలో ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టినా ఇసుక దందా యధేచ్ఛగా కొనసాగుతోంది. రావుల పాలెంమండలం గోపాలపురం ఇసుక ర్యాంపుకు ఎదురుగా ఉన్న రోడ్డులో ఇటుక బట్టీలు పక్కన కొబ్బరి తోటలో భారీగా ఇసుక నిల్వ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఉచిత ఇసుక పేరుతో నిలువ చేసి లారీలపై అధిక ధరలతో సుమారు రూ.18000 నుండి రూ 20,000 వరకు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారులైతే అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.

సంబంధిత పోస్ట్