మండపేట: మద్యం షాప్ తక్షణం తొలగించాలి

52చూసినవారు
మండపేటలోని సప్తగిరి ధియేటర్ వద్ద ఏర్పాటు చేసిన మద్యం దుకాణం తక్షణం తొలగించాలని మున్సిపల్ చైర్మన్ పతి వాడ నూక దుర్గా రాణి డిమాండ్ చేశారు. దీక్ష శిబిరంను ఆమె శనివారం సందర్శించారు. ఆందోళన చేస్తున్న ఉద్యమకారులకు తన మద్దతు తెలిపారు. మునిసిపల్ కో ఆప్షన్ సభ్యులు రెడ్డి రాధాకృష్ణ సైతం తన మద్దతు పలికారు. ఇక్కడ షాప్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏర్పాటు చేయకూడదని హెచ్చరించారు. విద్యార్థులు మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్