మండపేట ప్రజలకు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు క్రిస్మస్ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన అభిమానులకు, మిత్రులకు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులకు, అనధికారులకు ఆయన ఆంగ్ల సంవత్సర శుభాలు తెలిపారు. కొంగొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ ప్రజల ఆకాంక్షలు నెరవేరి విజయ పథం పయనించాలని అభిలషించారు.