జనసంచారం తిరిగే చోట మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదని స్థానిక మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండపేటలో సప్తగిరి థియేటర్ వద్ద మద్యం షాప్ ఏర్పాటును వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో మెదటిరో శనివారం నిరాహార దీక్ష చేపట్టారు. మద్యం షాపు వద్దంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. మహిళలు మాట్లాడుతూ.. ఇక్కడ ఏర్పాటు చేస్తే 28, 29, 30 వార్డుల్లో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.