మండపేట: ఉద్యోగుల వేతనాలు రూ.29 వేలుకు పెంచాలి

78చూసినవారు
ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె బుధవారానికి మూడో రోజుకు చేరుకుంది. మండపేట పురపాలక సంఘం ఎదుట నిరసన దీక్ష శిబిరం నిర్వహించారు. యూనియన్ అధ్యక్షుడు పి. సుబ్బరాజు వేతనాలు రూ. 29,000కు పెంచడం, అర్హులైన సీనియర్లను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్