మండపేట: మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దని రాస్తారోకో

79చూసినవారు
మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దని ఆదివారం మండపేటలో మహిళలు మద్యం షాపు నుండి ర్యాలీగా వచ్చి రాజారత్న జంక్షన్ లో రాస్తారోకో చేపట్టారు. ఈ నేపథ్యంలో పట్టణ సిఐ దారం సురేష్ సంఘటన స్థలానికి చేరుకుని నిరసనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చర్యలు తీసుకోకపోతే తహశీల్దార్ కార్యాలయం ముట్టడించి నిరసన చేస్తామన్నారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు ధూళి జయరాజ్ మాదిగ, సిఐటియు జిల్లా నాయకులు కే కృష్ణవేణి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్