మండల పరిధి చొప్పెల్ల లాకుల వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో ఒకరికి తీవ్ర గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. వారు తెలిపిన వివరాలు ప్రకారం రాజమహేంద్రవరం వైపు నుండి రావులపాలెం వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని అదే మార్గంలో వ్యతిరేక దిశలో వెళ్తున్న మరో ద్విచక్ర వాహనదారుడు ఢీ కొనడంతో ఒకరికి తీవ్ర గాయాలవ్వగా అతనిని హైవే పెట్రోలింగ్ పోలీసులు గుర్తించి, హుటా హుటీన హైవే అంబులెన్స్ పై రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల వివరాలు తెలియవలసి ఉంది. దీనిపై దర్యాప్తు కొనసాగుతుంది.