కాకినాడ ఎంపీ, జనసేన పార్టీ నాయకులు తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ ఐ. పోలవరం మండలం మురమళ్ళలో గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక జనసేన పార్టీ నాయకులు సలాది రాజా, పలువురు స్థానిక నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ముమ్మిడివరం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులతో వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు.