కాట్రేనికోన: ఎంపీ హరీష్ చొరవతో లీజు సొమ్ములు విడుదల

77చూసినవారు
కాట్రేనికోన: ఎంపీ హరీష్ చొరవతో లీజు సొమ్ములు విడుదల
కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామంలో గతంలో పాపారావు, ఈశ్వరరావు, నాగ పార్వతిల నుంచి ఓఎన్జీసీ స్థలం లీజుకు తీసుకుంది. డ్రిల్లింగ్ సమయంలో బ్లో అవుట్ ఏర్పడటంతో లీజు చెల్లించలేదు. ఆరేళ్ల నుంచి లీజు పెండింగ్లో ఉంది. దొరబాబు ఆధ్వర్యంలో బాధితులు ఎంపీని కలవగా ఆయన పెట్రోలియం శాఖామంత్రి అరదీప్ సింగ్ పూరిని కలిసి పరిస్థితి వివరించారు. ఎంపీ చొరవతో లీజు సొమ్ము రూ. 15 లక్షలు విడుదలైందని దొరబాబు సోమవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్