సారా తయారీ కేంద్రంపై పోలీసుల దాడి

6053చూసినవారు
సారా తయారీ కేంద్రంపై పోలీసుల దాడి
ఐ. పోలవరం మండలం గోగుల్లంక శివారు బైరవల్లంక మడఅడవుల సమీపంలో నాటుసారా తయారీ కేంద్రంపై ఐ. పోలవరం పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. ఎస్సై జె. భానుప్రసాద్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి సారా తయారీకి వినియోగించే ముడి సరకు, 2500 లీటర్ల పైగా బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఈ దాడిలో సారా తయారు చేసేవాళ్లు మాత్రం తప్పించుకున్నారు. సారా కాసే వారిపై పిడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్