నిడదవోలు: మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ

60చూసినవారు
నిడదవోలు: మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ
నిడదవోలు నియోజకవర్గంలో 19 మద్యం దుకాణాలు ఏర్పాటు చేయనున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ లావణ్య ఆదివారం తెలిపారు. నిడదవోలు పట్టణంలో 4, నిడదవోలు మండలంలో 5, ఉండ్రాజవరం మండలంలో 5, పెరవలి మండలంలో 5 చొప్పున మద్యం దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. వీటికి సంబంధించి ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్