నిడదవోలు ఆర్టీసీ డిపోలో గురువారం సాయంత్రం రోడ్డు భద్రత మాసోత్సవ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న నిడదవోలు ఎస్సై శోభన్ కుమార్ మాట్లాడుతూ ప్రమాద రహిత సమాజంగా రూపుదిద్దేందుకు డ్రైవర్లంతా సహకరించాలన్నారు. అనంతరం డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ కే వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.