పెద్దాపురం డివిజన్ లో 19, 926 పట్టభద్రుల ఓట్లర్లు ఉన్నారని పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణి తెలిపారు. గురువారం ఆమె పట్టభద్రుల ఓటర్ల తుది జాబితాను విడుదల చేశారు. ఈ మేరకు పెద్దాపురం డివిజన్ లో 11 మండలాల్లో 31 పోలింగ్ స్టేషన్ ల పరిధిలోని 19, 926 పట్టభద్రుల ఓట్లర్లు ఉన్నారని ఆమె వెల్లడించారు. అందులో పురుషులు 13, 296 మంది కాగా, మహిళలు 6, 631 మంది, ట్రాన్స్ జెండర్లు ఇద్దరు ఉన్నారని ఆమె మీడియాకు తెలిపారు.