పెద్దాపురం మండలంలోని కోడిపందేలు, గుండాటలపై 14 కేసులు నమోదు చేసినట్లు పెద్దాపురం ఎస్ఐ వి. మౌనిక తెలిపారు. గురువారం ఆమె మీడియాకు వెల్లడించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో సంక్రాంతి సందర్భంగా వివిధ గ్రామాల్లో నిర్వహించిన దాడుల్లో కోడి పందేలు, గుండాటలపై 14 మందిపై కేసులు నమోదు చేశామని అన్నారు. కోడిపందేలు, గుండాటలు, జూదాల అనర్ధాలపై అన్ని గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించామన్నారు.