పెద్దాపురం: ఏప్రిల్ 11న మెగా జాబ్ మేళా

72చూసినవారు
పెద్దాపురం: ఏప్రిల్ 11న మెగా జాబ్ మేళా
పెద్దాపురం మహారాణి కళాశాలలో ఏప్రిల్ 11న మెగా జాబ్ మేళా జరుగుతుందని వికాస నిర్వాహకులు శనివారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సహాయ సహకారంతో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఎస్ఎస్సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లమా, ఏదైనా డిగ్రీ, బీటెక్, పీజీ చేసిన 35 ఏళ్ల వయస్సు మించని అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనేందుకు అర్హులన్నారు.

సంబంధిత పోస్ట్