పాత పెద్దాపురంలో ఉరుసు గంధోత్సవం జనవరి20 నుంచి 22 వరకు ఘనంగా నిర్వహిస్తామని దర్గా కమిటీ అధ్యక్షులు ఎండీ లాయక్ ఆలీ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనవరి 20న ముస్లీం అంజుమన్ వ్యవస్థాపకుడు ఎం. ఏ సత్తార్ ఇంటి నుంచి గంధం ఊరేగింపుగా బయలుదేరి దర్గాకు చేరుకుంటుంది. రాత్రి 7 గంటలకు హైదరాబాదు వారిచే ప్రత్యేకంగా తయారు చేసిన పచ్చటి వస్త్రాన్ని అలంకరించి ఖురాన్ పఠనంతో గంధాన్ని పూస్తారని తెలిపారు.