సామర్లకోట జంక్షన్ మీదుగా పలు రైళ్ల పునరుద్ధరణ

63చూసినవారు
సామర్లకోట జంక్షన్ మీదుగా పలు రైళ్ల పునరుద్ధరణ
కాకినాడ జిల్లా సామర్లకోట జంక్షన్ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను బుధవారం నుంచి పునరుద్ధరిస్తున్నట్లు రైల్వేస్టేషన్ మేనేజర్ రమేష్ తెలిపారు. పలు ప్రాంతాల్లో వరద తీవ్రత తగ్గిన దృష్ట్యా రైళ్లను పునరుద్ధరించామన్నారు. విశాఖపట్నం-గుంటూరు, గుంటూరు-విశాఖపట్నం, డబుల్ డెక్కర్ రైలు, విజయవాడ-విశాఖపట్నం రత్నాచల్, విశాఖపట్నం-హైదరాబాద్ గోదావరి ఎక్స్ ప్రెస్ రైళ్లను బుధవారం నుంచి పునరుద్ధరించారని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్