పరాక్ రాష్ట్రీయ సర్వేక్షన్ చే జాతీయస్థాయిలో నిర్వహించబడుతున్న నాస్ పరీక్ష సామర్లకోట మండలంలోని ఆరు పాఠశాలలో బుధవారం ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని సామర్లకోట ఎంఈవోలు వై శివరామకృష్ణయ్య, పి పుల్లయ్యల పర్యవేక్షణలో నిర్వహించారు. నాస్ పరీక్ష మూడో తరగతి గాను రెండు పాఠశాలలో 42 మంది హాజరయ్యారు. ఆరో తరగతిలో 30 మంది తొమ్మిదో తరగతిలో మూడు పాఠశాలలో 86 మంది విద్యార్థులు హాజరయ్యారు.