కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపల్ హైస్కూల్ అయోధ్య రామ పురం విద్యార్థులు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు తోటకూర సాయి రామకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. మండల స్థాయి పోటీల్లో 14 మంది, జిల్లా స్థాయిలో 11 మంది విజయం సాధించగా, గౌతమ్, జి.లక్ష్మి వర్షిణి (అండర్ 14) ఖో ఖో, సి హెచ్ కార్తీక్ (అండర్ 17) కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు.