బైక్ పై నుంచి పడి వ్యక్తికి తీవ్ర గాయాలు
కాకినాడ జిల్లా సామర్లకోట హుస్సేన్ పురం సమీపాన శనివారం తెల్లవారుజామున షుగర్ ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్ వద్ద బైక్ పై నుంచి ఓ వ్యక్తి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో పిఠాపురం మండలం మల్లం గ్రామానికి చెందిన లోవరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని స్థానికుల సహకారంతో సామర్లకోట ప్రభుత్వాసుపత్రికి తరలించగా తలకు తీవ్ర గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. ప్రథమ చికిత్స నిర్వహించి కాకినాడ ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు.