గొల్లప్రోలు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అరిగెల అచ్చెయమ్మ రామన్న దొర అధ్యక్షతన గొల్లప్రోలు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు. అచ్చెయమ్మ రామన్న దొర మాట్లాడుతూ వేసవికాలం దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లో మంచినీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంపీడీవో స్వప్న మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించి తమ దృష్టికి తీసుకెళ్తే తక్షణం పరిష్కరిస్తామని తెలిపారు.