దక్షిణ కాశీగా పేరుగాంచిన పాదగయ క్షేత్రంలో ఉమాకుక్కుటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం ధ్వజారోహణ, అంకురార్పణ శాస్త్రోక్తంగా నిర్వహించగా, సోమవారం రాత్రి 82 నిమిషాలకు స్వామి వారి దివ్య కళ్యాణం జరుగుతుంది. బుధవారం పుణ్యస్నానాలు, అభిషేకాలు, మహా లింగోద్భవ కాలాభిషేకం నిర్వహించనున్నారు. గురువారం రథయాత్ర, శుక్రవారం తెప్పోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ అధికారులు తెలిపారు.